ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
CRPF రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ పరీక్షలో తమిళాన్ని చేర్చకపోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(MK Stalin) వ్యతిరేకించారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah)కు లేఖ రాశారు. ఆంగ్లం, హిందీ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించాలని కోరారు.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిర...
బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)కు వారణాసీ(Varanasi)లో చేదు పరాభవం ఎదురైంది. అక్కడి హోటల్‌లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లగేజీ(luggage)ని బయటపడేశారు. హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Karnataka: కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఓట్లు రాబట్టుకునేందుకు సాధ్యం కాని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 ల...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస...
కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi), కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళ(Kerala)లో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం(Ernakulam), తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Chocoate:భర్త చాక్లెట్ తీసుకురాలేదని 25 ఏళ్ల భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని హెన్నూరు బండే సమీపంలోని హొన్నప్ప లేఅవుట్‌లో చోటుచేసుకుంది. సెలూన్‌లో పనిచేసే గౌతమ్, అతని భార్య నందిని కాలేజీ నుంచి ఒకరికొకరు తెలుసు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఘటన జరిగిన రోజు గౌతమ్‌ను నందిని పనికి వెళ్లకుండా అడ్డుకుంది. ఆపై ఇద్దరి మధ్య గొడవ జరిగ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL )16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు అజింక్య రహానే(Ajinkya Rahane), రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు.
Kiren Rijiju : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన జమ్మూలోని బనిహాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తన బుల్లెట్ ప్రూఫ్ కారులో కిరణ్ రిజిజు శ్రీనగర్ వెళ్తున్న సమ...
Emine Dzhaparova: ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు రానున్నారు. గతేడాది జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. ఝపరోవా భారత పర్యటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఉక్రెయిన్ విదేశాంగ వ్యవహారాల మొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ ఝపరోవా ఏప్రిల్ 9 నుండి 12 వరకు భారతదేశంలో అధికారిక పర్యట...