ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భుమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భుకంప కేంద్రం క్యాంప్‌బెల్ (Campbell) తీరానికి 220 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ (MP GVL) నరసింహారావు కేంద్రంలో కీలక పదవి వరించింది. వారణాసీ కాశీ తెలుగు సమితి(Kashi Telugu Samiti) గంగా పురష్కరాల నిర్వహణ కమీటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర (Sri Rama Taraka Andhra) ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం నిర్వహించారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీలన్నీ కసిమీద ఉన్నాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలను పదునుపెడుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రానుంది. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అధికార బీజేపీ ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేయ...
బులియన్ మార్కెట్(Bullion market)లో ఇటీవల కాలంలో బంగారం (Gold), వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,790 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,860 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది.
పెళ్లి మండపంలో నవవధువు (Navavadhuvu) చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం హథ్రాస్ లోని సాలెంపూర్(Salempur) లో జరిగింది. సరాదా శృతిమించి వధువు తుపాకీతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు(firing) జరిపింది. అనంతరం గన్ బంధువులకు ఇచ్చేసింది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.