»Liquor Is Healthy To Body Chhattisgarh Excise Minister Kawasi Lakhma
Liquor ఒంటికి మంచిది, నొప్పులు తెలియవు.. ఛత్తీస్ ఘడ్ మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్
ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
Liquor is healthy to body: Chhattisgarh Excise Minister Kawasi Lakhma
Chhattisgarh Excise Minister Kawasi Lakhma:ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా ( Kawasi Lakhma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం (Liquor) ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ (drink) చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు. అతిగా తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదన్నారు.
కార్మికులు, కూలీలు మద్యం సేవించకుంటే మరుసటి రోజు బలం రాదు.. ఒంటి నొప్పులతో పనికి వెళ్లరు అని గుర్తుచేశారు. గతంలో తాను కూడా పనులు చేశానని.. వారి కష్టం తనకు తెలుసు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం బఘెల్ (cm baghel) మద్యపానం నిషేధం విధిస్తే.. బస్తర్లో మాత్రం అమలు కానివ్వను అని స్పష్టంచేశారు. తాను బతికి ఉన్నంత వరకు ఆ పని జరగదని పేర్కొన్నారు.
బస్తర్లో (bastar) దేవతలకు కూడా మద్యం సమర్పిస్తామని లామా చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు ఇక్కడ లిక్కర్ సేవిస్తారని.. అదీ లేకుండా పూజించమని తెలిపారు. ప్రయాణం కూడా చేయమని చెప్పారు. బస్తర్లో ఎవరూ లిక్కర్ బ్యాన్ చేయలేరని లఖ్మా అంటున్నారు.
విదేశాల్లో 100 శాతం మద్యం సేవిస్తారని మంత్రి (Kawasi Lakhma) గుర్తుచేశారు. ఇక్కడ కేవలం 90 శాతం మాత్రమే లిక్కర్ తీసుకుంటారని మంత్రి లఖ్మా (Kawasi Lakhma) వివరించారు. కార్మికులకు మద్యం మందుగా పనిచేస్తుందని తెలిపారు. ఆ రోజు మద్యం (liquor) తీసుకోకుంటే.. మరుసటి పని చేయలేరని.. ఇక బరువైన పనిని అసుల చేయరని పేర్కొన్నారు.
లఖ్మా కామెంట్లను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. లఖ్మా ఎనాడైనా బరువైన పనిచేశారా అని మాజీ సీఎం రమణ్ సింగ్ (raman singh) అడిగారు. తాను కూడా బరువైన పనులు చేస్తానని.. ఏ రోజు కూడా లిక్కర్ ముట్టలేదని తెలిపారు.
#WATCH | Chhattisgarh Excise Minister Kawasi Lakhma says, "There will be no liquor ban in Bastar as long as I am alive". (09.04) pic.twitter.com/6zoFdwDiVU