Ganga Pushkaralu : బీజేపీ ఎంపీ జీవీఎల్ కు వారణాసిలో కీలక పదవి
బీజేపీ ఎంపీ జీవీఎల్ (MP GVL) నరసింహారావు కేంద్రంలో కీలక పదవి వరించింది. వారణాసీ కాశీ తెలుగు సమితి(Kashi Telugu Samiti) గంగా పురష్కరాల నిర్వహణ కమీటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర (Sri Rama Taraka Andhra) ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం నిర్వహించారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ (MP GVL) నరసింహారావు కేంద్రంలో కీలక పదవి వరించింది. వారణాసీ కాశీ తెలుగు సమితి(Kashi Telugu Samiti) గంగా పురష్కరాల నిర్వహణ కమీటీ గౌరవాధ్యక్షుడిగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. శ్రీరామ తారక ఆంధ్ర (Sri Rama Taraka Andhra) ఆశ్రమంలో కె.నరసింహమూర్తి అధ్యక్షతన కాశీ తెలుగు సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న గంగా పుష్కరాల(Ganga Pushkaralu)కు సంబంధించి కొన్ని కీలక అంశాలపై తీసుకోవాలసిన చర్యలపై పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఈ సమావేశంలో శ్రీ గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడిగా జీవీఎల్ నర్సింహారావుని ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే కాశీ తెలుగు సమితి ఉపాధ్యక్షుడిగా వి.సుబ్రహ్మణ్యం(V. Subrahmanyam)(మణి), కార్యదర్శిగా వి.వి.సుందర్ శాస్త్రి, జాయింట్ సెక్రటరీగా టి.గజానన్ జోషిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పవిత్ర గంగా పుష్కరాల సందర్భంగా జరగాల్సిన వివిధ సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో చర్చించారు.