ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్(Shigaon) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్‌లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
మార్చి నెలలో చమురు వినియోగం (India's fuel demand) భారీగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
స్నేహితుడితో పందెం వేశామని అందులో భాగంగా అలా జాతీయ గీతం పాడినట్లు యువతులు చెప్పారు. ఎలా చేసినా అది తప్పే కావడంతో ఆ యువతులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పాకిస్తాన్ లోని వారి కంటే భారత్ ముస్లీంల జీవన విధానం బాగుందని, అలాగే అక్కడ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, కానీ భారత్ లో అలా కాదని నిర్మలా సీతారామన్ అన్నారు.