»Bjp Has Announced The First List Of 189 Candidates For The Karnataka Assembly Election
Karnataka: అసెంబ్లీ ఎన్నికలకు 189 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు.సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్(Shigaon) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
Karnataka:కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly elections) సమీపిస్తుండంతో రాజకీయ పార్టీలన్నీ వేగం పెంచాయి. ఇప్పటికే ప్రతిపక్షపార్టీలన్నీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల జాబీతాలనుప్రకటించాయి. తాజాగా 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను అధికార పార్టీ బీజేపీ(BJP) ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ జాబితాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నాలుగు రోజులుగా కసరత్తు చేసి జాబితా రూపొందించింది. జాబితా తయారీకి ముందు కొందరు సీనియర్లను పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్లు తెలిసింది. సీఎం బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్(Shigaon) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు.
మంత్రి ఆర్.అశోక పద్మనాభనగర్, కనకపుర స్థానాల్లో రాష్ట్ర కాంగ్రెస్ చీప్ డీకే శివకుమార్(DK Sivakumar) తో తలపడనున్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫస్ట్ లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులు, 32 మంది వెనుబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాల వారు ఉన్నారు. 9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు , 8 మంది మహిళలు ఉన్నారు. రెండో జాబితా త్వరలో రానుందని సీఎం బసవరాజు బొమ్మై(CM Basavaraju Bommai) తెలిపారు. మే 10న ఎన్నికలు జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది. ఎన్నికల వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్ఐఆర్లు(FIR) నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 126 కోట్ల రూపాయల నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.