»In Karnataka Over 2 6 Lakhs Voters Opted For Nota
Nota: కర్ణాటకలో నోటాకు ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయో తెలిస్తే షాక్ అవుతారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి హంగ్ రూపంలో కాకుండా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజల జై కొట్టారు.
Nota: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి హంగ్ రూపంలో కాకుండా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజల జై కొట్టారు. అయితే, ఈ తీర్పుతో సంబంధం లేకుండా కొందరు ఓటర్లు ఉన్నారు. అంటే.. వారు అభ్యర్థులెవరికీ ఓటేయలేదు. నోటా (none Of the above) మీటను నొక్కారు. సుమారు 2.6 లక్షల మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు.
మే 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3 కోట్ల 84 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,59,278 మంది ఓటర్లు నోటా మీటను ఎంచుకున్నారు. అంటే 0.7 శాతం మంది నోటా మీట నొక్కారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం ఈ సంఖ్య వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ మినహాయించి 2019 నుంచి కాంగ్రెస్ ఒక్క రాష్ట్ర అసెంబ్లీలోనూ విజయం సాధించలేదు. ఇప్పుడు కర్ణాటకలో విజయపతాకాన్ని ఎగరేసింది. కాగా, బీజేపీకి ఈ రాష్ట్రం కీలకమైంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే. కాంగ్రెస్‌కు వొక్కలిగ, లింగాయత్‌ల నుంచి ఓట్లు ఆశించిన మేర పడ్డట్టు తెలుస్తున్నది. వీరి రీజియన్లతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాల్లోనూ కాంగ్రెస్‌కు మంచి ఓట్లు వచ్చాయి.