»Earthquake In Andaman For The Third Time In 24 Hours
earthquake : అండమాన్ లో భూకంపం.. 24 గంటల్లో మూడో సారి..
అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భుమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భుకంప కేంద్రం క్యాంప్‌బెల్ (Campbell) తీరానికి 220 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.
అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భుమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భుకంప కేంద్రం క్యాంప్‌బెల్ (Campbell) తీరానికి 220 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారుజామున దాకా 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తర్వాత మిజోరం(Mizoram) లోనూ ఉదయం 6.16 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్ సీఎస్ తెలిపింది.
భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, చాంఫైకి నుంచి 151 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం 2.59 గంటలకు మొదటిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. తర్వాత గంటల వ్యవధిలోనే మరోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం ( huge earthquake)వచ్చింది. భూమికి 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా ఎన్ సీఎస్ (NCS)వెల్లడించింది. ఇక ఈనెల 6న కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది.గత గురువారం రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్(Port Blair) కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.