»Corona Boom Again In The Country Positive Cases Have Increased Massively
Covid : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi), కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళ(Kerala)లో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం(Ernakulam), తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi), కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళ(Kerala)లో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం(Ernakulam), తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్(Health Minister Veena George) అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్(Oxygen) బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఢిల్లీలో కొత్తగా 535 కరోనం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20 వేల 13 లక్షల 938కు చేరింది. వీటిలో 26 వేల 536 మంది మృతి చెందారు.
పాజిటివిటీ రేటు (positivity rate) 23.05 శాతానికి పెరిగింది.జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు. వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ (Booster dose) తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు.కాగా, ఇన్ ఫ్లూయెంజా(Influenza) సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ ఫ్లూయెంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. H3N2 వైరస్ సోకితే ముక్కు కారడం, నిరంతర దగ్గు మరియు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఇన్ ఫ్లుయెంజా కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. దేశంలో కోవిడ్ ప్రకంపనలతో కేంద్రం అప్రమత్తమైంది.
రాష్ట్రాలు(States), కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. కోవిడ్(covid)కి అవసరమైన మందులు, వైద్యపరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా ప్రకటించింది. ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు(Doctors), నర్సులు, ఇతర మానవ వనరులను కూడా సమకూర్చుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా కేసులు ఈమధ్య పెరుగుతున్న నేపథ్యంలో జనాలు జాగ్రత్తలు పాటించకరపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని.. దీనివల్ల కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ (Department of Health) తెలిపింది. ప్రస్తుతం వైరస్ (Virus) తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది ఇబ్బందులు పడొచ్చని తెలిపారు. చిన్న పిల్లలు(little children), దీర్ఝకాలిక సమస్యతో బాధపడున్నవారు, వృద్ధులపై ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ వేరియంట్(Variant) లో కొత్త కొత్త మార్పులు జరుగుతున్నందున జాగత్తగా ఉండాలని సూచించారు.
చదవండి :Chocoate: భర్త చాక్లెట్ తీసుకురాలేదని భార్య ఆత్మహత్య