»Bihar News The Mother In Law Killed The Daughter In Law Out Of Anger That The Son Had Entered Into A Love Marriage
Love Marriage: కోడలికి శివుడిని చూపిస్తానని తీసికెళ్లి చావు చూపించిన అత్త
అబ్బాయి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబం ముందుగా కొడుకు, కోడలును ఇంటికి పిలిపించింది. అప్పుడు కోడలిని భజనకు తీసుకెళ్లి బలితీసుకున్నారు.
Love Marriage: బీహార్(Bihar) రాష్ట్రం ఛప్రాలోని పానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేనుకి చావర్ గ్రామ సమీపంలో 15 రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ మృతదేహం(Dead Body) లభ్యమైంది. మృతి చెందిన మహిళ గౌరా ఓపీ పరిధిలోని చందా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ భార్య పూజా కుమారిగా పోలీసుల విచారణలో తేలింది. మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు కేసును లోతుగా విచారించారు. విచారణలో వారికి నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను అత్తగారే హత్య చేసినట్లు తేలింది. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు.
నాలుగేళ్ల క్రితం నితీష్(Nithish), పూజ(Pooja)ను కుటుంబసభ్యుల ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత నితీష్ తన భార్యతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరి పెళ్లి(Marriage)కి నితీష్ కుటుంబం అంగీకరించలేదు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు కుటుంబం నితీష్, పూజను ఇంటికి ఆహ్వానించింది. అప్పుడు నితీష్ తల్లి తన ఇతర స్నేహితులతో కలిసి పూజను శివచార(శివుడి భజన)(Lord shiva)ను చూడటానికి ధనుక గ్రామానికి తీసుకెళ్లింది.
అప్పుడే పూజను హత్య చేసి మృతదేహాన్ని చన్వార్లోని కాలువ(Canal)లో పడేసింది. భార్య అదృశ్యమైన తర్వాత నితీష్ ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పది రోజుల తర్వాత పూజా మృతదేహాన్ని పోలీసులు కాల్వలో గుర్తించారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని మహిళపై విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం పోలీసులు మహిళను గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పోలీసుల లాఠీ రుచి చూపించడంతో జరిగిన సంఘటనంతా చెప్పింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.