కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. జనతాదళ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.
మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.
హర్యానాలోని అంబాలా నుంచి మూడుసార్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) గురువారం పీజీఐ ఆస్పత్రిలో మృతి చెందారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం తర్వాత సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపుల అనంతరం సిద్ధరామయ్యనే సీఎంగా చేయాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది.
న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు..అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర న్యాయ మంత్రిగా పని చేస్తున్న కిరణ్ రిజిజును తొలగించారు. ఈ క్రమంలో భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ని లా మినిస్టర్ గా తీసుకున్నారు. అయితే కొలిజియం వ్యవస్థపై అనేక సార్లు కిరణ్ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ...
చెన్నై (Chennai) నుంచి కోట్ల 535 నగదుతో బయల్దేరిన కంటైనర్ వాహనం మరమ్మతు లకు గురై రోడ్డుపై నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాసేపు ఎండకు వెళ్తే చాలు గొంతు ఎండిపోతుంది.. శరీరం చెమటతో తడిచిపోతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ స్నానం చేయాలంటే ఇంట్లో మాత్రమే చేయగలం.. కానీ ఓ జంట ఫుల్ రష్ ఉన్న ట్రాఫిక్ లో సిగ్గువిడిచి స్నానం చేసింది.
చిరుతపులి దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ వ్యక్తి బహిరంగంగా మంచంపై నిద్రిస్తున్నాడు. అతని పక్కన ఒక కుక్క కూడా పడుకుని ఉంది. ఇంతలో ఓ చిరుత రాత్రి చీకట్లో కుక్కను ఎత్తుకెళ్లింది.
ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్- అనుష్క శర్మకు ఇద్దరు బైకర్లు లిప్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.