రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. అంతర్జాతీయ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) ఈ విషయాన్ని ధృవీకరించారు.
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సోమవారం జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలపై ఇరువురు చర్చించుకున్నారు.
నేడు అంటే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి.
తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్ (Saksi malik), బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.
బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత పునరుద్ధరణ పనులు జరిగిన వెంటనే ఒడిశా(odisha)లో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లా(Bargarh district)లో నమోదైంది. బర్గర్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలులోని పలు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్...
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.....
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.
బిహార్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్‌లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
పట్టుదల, కృషితో ముందుకుపోయి దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, కరెంట్, సాగునీటి సమస్యలను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.