»Praise For Ashwini Vaishnaw Odisha Balasore Accident Clear In 51 Hours
Ashwini Vaishnaw:పై ప్రశంసల జల్లు..పలువురికి ఆదర్శంగా నిలిచిన మంత్రి
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.
భారతదేశంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం(train accident) ఇటీవల ఒడిశా(odiasha)లోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను ఒడిశా ప్రభుత్వం 288 నుంచి 275 కు సవరించింది. కొన్ని మృతదేహాలను ముందుగా రెండుసార్లు లెక్కించినట్లు తెలిపింది. మరోవైపు గాయపడిన వారి సంఖ్య 1,175కు చేరింది. వారిలో చాలా మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 300 కంటే తక్కువ మంది ఆసుపత్రిలో ఉన్నారని ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. ఈ ఘటనను దేశ చరిత్రలో మూడవ అత్యంత ఘోరమైన రైలు విపత్తుగా పేర్కొన్నారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ స్థలంలో ట్రాక్ రైలు సేవలను త్వరగా పునరుద్ధరించగలిగారు. కేవలం ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ రైలు సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతోపాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) చొరవ కీలకమని చెప్పవచ్చు. రాత్రింబవళ్లు కేంద్ర మంత్రి సైతం సిబ్బందితోపాటు అక్కడే ఉండే పనితీరును పరిశీలించారు. ప్రమాద స్థలంలోనే ఉండి పరిస్థితి తీవ్రత గురించి ఆరా తీశారు. దీంతోపాటు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, రైల్వే బోర్డు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేయాలని కోరారు.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
జూన్ 5న రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రార్థనలు చేశారు. పునరుద్ధరణ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరి శ్లాఘనీయ ప్రయత్నాలను మంత్రి అభినందించారు. రెండు ట్రాక్‌లు పునరుద్ధరించబడ్డాయి. 51 గంటల్లో రైలు కదలిక మొదలైందని అన్నారు. రైలు ప్రయాణం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుందని రైలు బయలుదేరిన తర్వాత అతను చెప్పాడు. గూడ్స్ రైలు పునరుద్ధరించబడిన లైన్ గుండా వెళుతుండగా రైల్వే మంత్రి(railway minister) అక్కడే ఉండి పర్యవేక్షించారు. అయితే గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రైల్వే శాఖ మంత్రి కూడా ఇంత చొరవ తీసుకోలేదు. కేవలం ప్రకటనలు మాత్రమే చేసేవారు. అనేక రోజులు ఆయా పనులు అలాగే ఉండేవి. కానీ మంత్రి ఆధ్వర్యంలో అంతపెద్ద ప్రమాదాన్ని కేవలం 51 గంటల్లోనే క్లియర్ చేయడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.