Bandi Sanjay: కాంగ్రెస్ బీజేపీ అంటే ఉప్పు నిప్పు.. ఇక ఆ పార్టీ నేతలు పొగడ్తలు, ప్రశంసలకు చోటు లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.. ఇది నిజంగా గ్రేట్ అన్నారు.
త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు. బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5.04 లక్షలు చెల్లించాలని కోరారు.
నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తోపాటు స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు మిడ్ మానేరు ప్యాకేజీ పరిహారం తీసుకున్నారని ఆరోపించారు. అర్హత లేకున్నా ఎలా తీసుకుంటారని అడిగారు.