ఒడిశా(Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, 288 మంది చనిపోయారు. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక(financial)-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. పిల్లల చదువులు(Studies), పెళ్లిళ్లు, వ్యాపారాలు, వ్యాపకాలు, ఆధారపడినవాళ్ల బాగోగులు వంటి వాటిపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ (Travel Insurance) ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే ₹10 లక్షల బీమా అందుతుంది. మీరు రెగ్యులర్‌గా రైలు ప్రయాణం చేసే వ్యక్తులైతే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది.
లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటేనే బీమా క్లెయిమ్ (Insurance claim) పొందడం సులభం అవుతుంది. ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రయాణికుడికి ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే జరిగిన నష్టాన్ని బట్టి బీమా అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు చనిపోతే అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా.. బీమా కంపెనీ (Insurance company) అతనికి రూ.10 లక్షలు పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7 లక్షల 5 వేలు, గాయాలైతే రూ.2 లక్షలు ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల్లోపు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ ఆఫీస్‌కు వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, డాక్యుమెంట్స్ ఇస్తే ఇన్సూరెన్స్ డబ్బు పొందవచ్చు. భారతీయ రైల్వే (Indian Railways) అందిస్తున్న ఈ ఫెసిలిటీని ఎవరు పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ ఒడిశా లాంటి ఘటనలు జరిగితే ఈ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మృతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది.