బీహార్ సీఎం నితీశ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లగా ఇద్దరు బైకర్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. వారిని గమనించి ఫుట్ పాత్‌పై దూకడంతో ప్రమాదం తప్పింది.
దేశవ్యాప్తంగా ఈ రోజు(జూన్ 15న) బంగారం ధరలు దాదాపు 400 రూపాయలు తగ్గాయి. దీంతోపాటు వెండి రేట్లు కూడా దిగువకు చేరాయి. అయితే ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ చుద్దాం.
బిపార్జోయ్ తుఫాను(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి దగ్గరికి వచ్చింది. ఈరోజు(గురువారం) సాయంత్రం తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్రమైన గాలులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న 74 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ టి. వెంకట్‌రామ్‌రెడ్డి(Venkatrami Reddy)తోపాటు ప్రమోటర్లను కూడా ఈడి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
మన శరీరం ఎముకలు, మాంసాలతో నిర్మితమైంది. అవి సక్రమంగా పనిచేయడానికి రక్తం అవసరం. శరీరానికి సరిపడా రక్తం అందకపోతే ప్రాణానికే ప్రమాదం. శరీరానికి రక్తం అవసరమైనప్పుడు సకాలంలో రక్తాన్ని సరఫరా చేస్తే, వ్యక్తి జీవితాన్ని రక్షించవచ్చు. సరైన సమయంలో రక్తం అందకపోతే ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది.