సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
బిపర్‌జాయ్(Biparjoy) తుఫాను(storm) మరింత తీవ్రమై గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి వెల్లడించారు.
భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్‌గా MRF అగ్రస్థానంలో నిలించింది. మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్లో MRF షేర్లు 1.37% పెరిగి 52 వారాల సరికొత్త గరిష్ట స్థాయి రూ.100,300కి చేరుకుని ఈ ఘనతను సాధించింది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పలువురు ఖాతాలు బ్లాక్ చేశామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సైతం స్పందించారు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించే వరకు దేశ రాజధానిలో ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు(supremecourt) వెల్లడించింది.
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని వేలూరులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఆయన వివరించారు.