»Tragedy In Fashion Show Model Died After Lighting Truss Fell On Him Noida
Fashion show:లో విషాదం..మోడల్ పై లైటింగ్ ట్రస్ పడి మృతి
నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రమాదం జరిగింది. పైన ఏర్పాటు చేసిన లైటింగ్ ట్రస్(lighting truss) ఆకస్మాత్తుగా నేలపై కూలిపోవడంతో 24 ఏళ్ల మోడల్ మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాషన్ షో నిర్వాహకులను, లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ నోయిడా(noida)లోని ఫిల్మ్ సిటీలో ఫ్యాషన్ షోలో విషాదం చోటుచేసుకుంది. 24 ఏళ్ల మోడల్‌పై లైటింగ్ ట్రస్(lighting truss) అనూహ్యంగా కుప్పకూలడంతో ఆమె మరణించింది. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డారు. మృతురాలు వంశిక చోప్రా గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 2 నివాసి కాగా, ఆమె సహోద్యోగి బాబీ రాజ్, ఆగ్రా నివాసి అని తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని నోయిడాలోని సెక్టార్ 27లోని కైలాష్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ షో నిర్వాహకులు లైటింగ్ ట్రస్ అమర్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.