Asia Cup Hockey 2023: ఆసియా కప్ హకీలో (Asia Cup Hockey) భారత్ జూనియర్ హాకీ మహిళల జట్టు సత్తా చాటింది. దక్షిణ కొరియాను మట్టి కరిపించి జయకేతనం ఎగరవేసింది. 2-1తో దక్షిణ కొరియాను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ (india) తరఫున అన్నూ, నీలం గోల్ చేశారు. కొరియా తరఫున పార్క్ సియోన్ ఒక గోల్ చేశారు. ఫైనల్ మ్యాచ్ జపాన్‌లో గల కకమిగహర నగరంలో జరిగింది.
లీగ్‌లో భారత (india) జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 4 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ 3 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. తొలి మ్యాచ్ 2-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి.. తన జైత్రయాత్రను కొనసాగించింది. టోర్నీలో భారత్, చైనా, కొరియా, జపాన్, మలేషియా జట్లకు ర్యాంక్స్ ఆధారంగా నేరుగా ప్రవేశం లభించింది. కజకిస్తాన్, హాంకాంగ్, చైనీస్ తైపీ, ఉబ్జెకిస్తాన్, ఇండోనేషియా దేశాలకు గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తానలో జరిగిన మహిళల జూనియర్ కప్ ద్వారా అర్హత సాధించాయి.
భారత జూనియర్ మహిళల జట్టును యావత్ భారత్ (india) అభినందిస్తోంది. కప్ గెలవడం గర్వంగా ఉందని.. ఈ ఏడాది చివరలో జరిగే జూనియర్ ప్రపంచ కప్‌కు ఈ విజయం పునాది అవుతుందని హాకీ ఇండియా ప్రెసిడెంట్ పద్మ శ్రీ డాక్టర్ దిలీప్ టర్కీ అన్నారు. ఆటగాళ్లకు నగదు పురస్కారం అందజేయాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుందని వివరించారు.