WTC 2023: వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 209 పరుగుల తేడాతో టీమ్ ఇండియాపై విక్టరీ కొట్టింది. రెండో ఇన్సింగ్స్‌లో భారత్ బ్యాట్స్ మెన్ పెద్దగా ప్రభావం చూపలేదు. 444 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం 234 పరుగులు మాత్రమే చేయగలిగి.. చాప చుట్టేశారు. ఫస్ట్ డే నుంచి చివరి రోజు వరకు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. కోహ్లి 49, రహానే 46, రోహిత్ 43, పుజారా 27, భరత్ 23, గిల్ 18 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 3, లియోన్ 4, స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్ ఒక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఏ స్థాయిలో రాణించలేదు. కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్ చేసింది 270 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా తీరు మారలేదు. కేవలం 234 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 209 పరుగులతో విజయం సాధించిన ఆస్ట్రేలియా వరల్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా అవతరించింది.
ఇవాళ ఐదో రోజు ఆట కాగా 164-3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 70 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోయింది. లంచ్‌కు ముందే చేతులెత్తేసింది. ఇవాళ్టి ఆటలో భారత్ పతనానికి బోలాండ్ శ్రీకారం చుట్టారు. ఒకే ఓవర్లో కోహ్లీ, రహానేను ఔట్ చేసి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విజయంతో ఆసీస్ క్రికెట్ టీమ్.. ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్ల మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.