ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలతో ఇటీవల తరచూ వార్తల్లోకెక్కిన ఎయిరిండియా (Air India).. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థకు చెందిన ఓ విమానంలో పైలట్లు ప్రయాణ సమయంలో తమ స్నేహితురాలిని కాక్‌పిట్ (Cockpit)లోకి ఆహ్వానించారు. దిల్లీ-లేహ్ విమానంలో (Delhi – Leh Flight) గతవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. కాక్‌పిట్‌లోకి ఇలా ప్రయాణికులను ఆహ్వానించడం ఎయిరిండియా గత ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఢిల్లీ(Delhi) – లెహ్ ఎయిరిండియా విమానంలో జూన్ 3వ తేదీన ఇద్దరు పైలట్లు (pilots) కాక్‌పిట్ లోకి స్నేహితురాలిని ఆహ్వానించారు. ఈ ఘటనపై ఎయిరిండియా కఠిన చర్యలు చేపట్టింది. గత ఆరు నెలల్లో ఎయిరిండియా విమానంలో ఇలా జరగడం ఇది రెండోసారి. గతవారం ఢిల్లీ నుండి లెహ్ (Leh)వెళ్లిన ఎయిరిండియా ఏఐ 445 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విమాన ప్రయాణికుల్లో ఒకరు పైలట్, కో-పైలట్ కు స్నేహితురాలు. దీంతో విమానం టేకాఫ్ (take off) అయిన కాసేపటికి నిబంధనలకు విరుద్ధంగా ఆమెను కాక్ పిట్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదుతో బయటకు వచ్చింది.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎయిరిండియా కఠిన చర్యలు చేపట్టింది. పైలట్, కో-పైలట్ ను విధుల నుండి పక్కన బెట్టిన ఎయిరిండియా ఘటనపై దర్యాఫ్తు (find out)చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎయిరిండియా నుండి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా, ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, నిబంధనల ప్రకారం చర్యలు తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీసీఏ
(DGCA) తెలిపింది.