»Tamil Nadu Minister Senthil Balaji Arrested In Money Laundering Case
Senthil Balaji: మనీలాండర్ కేసులో సెంథిల్ బాలాజీ అరెస్ట్..ఏడ్చేసిన మంత్రి
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న సెంథిల్ బాలాజీ(Senthil Balaji)ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సచివాలయంలోని ఆయన కార్యాలయం, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఈయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఉద్యోగాల విషయంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఈడీకి ఆధారాలు లభించడంతో… మంత్రిని అరెస్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ వార్త విన్న వెంటనే చాతినొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు సెంథిల్ బాలాజీ. కాగా వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేయించారు.
తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్లో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్(ED) సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన సోదాలు కూడా పూర్తయ్యాయి. కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఆయనను చేర్చారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, మ సుబ్రమణ్యం, ఎవ వేలు, రఘుపతి, శేఖర్ బాబు తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మంత్రి మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు.
ఆ సమయంలో కారులో పడుకుని నొప్పితో ఏడుస్తూ మంత్రి సెంథిల్ బాలాజీ కనిపించారు. అయితే ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి(hospital)కి తరలించిన సమయంలో ఉద్రిక్తతత నెలకొంది. ఇక అదే సమయంలో.. సెంథిల్ బోరున విలపించారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సెంథిల్ అరెస్టును తీవ్రంగా ఖండించింది డీఎంకే(DMK). కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందన్నారు డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.