కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమర్‌నాథ యాత్ర జులై 1 నుంచి మొదలవుతోంది. ఈ యాత్రకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
రెండు పక్షులు కలిసి బతికాయి. కానీ విధి వారిని విడదీసేందుకు ప్రయత్నించింది. ఓ పక్షి ప్రాణాలు పోవడంతో మరో పక్షి తట్టుకోలేకపోయింది. ఆ పక్షిపైనే తలవాల్సి మరో పక్షి కూడా ప్రాణాలు వదిలింది. ప్రేమకు నిదర్శనమైన ఈ పక్షుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
పాట్నాలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ పాలనా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. రక్షణశాఖ భూములను కావాలని అంటోంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ కలిసి విన్నవించారు. స్కై వేకోసం ఆ భూమి కావాలని.. అదే రేటు ఉన్న మరో చోట భూమి ఇస్తామని చెబుతున్నారు.
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్(Adipurush) సినిమా..ఆది నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారంటూ మండి పడ్డారు కొందరు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్‌ని బ్యాన్(ban) చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ సీఎం కూడా ఆదిపురుష్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడ...
ప్రధాని మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో రాష్ట్ర విందు ఏర్పాటు చేశారు. భారత్, అమెరికాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశంలోని వ్యాపారవేత్తలు కూడా ఇందులో భాగమయ్యారు.
అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జులై 12 నుంచి16 తేదీ వరకు బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం పోటీల్లో పాల్గొనే 54మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.
పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబయిలో 9/11, 26/11 దాడులు జరిగిన దశాబ్దానికి పైగా ఉగ్రవాదం ఇంకా ప్రపంచానికి ముప్పుగా ఉందని ఆయన అన్నారు.
తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు గట్టిగా కేకలు వేశారు. పోలీసుల కేకలకు భయపడిన చిరుత ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది. తిరుమలలో నడకదారి మార్గం 7వ మైలు వద్ద గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.