»Opposition Meeting To Defeat Bjp Rahul Gandhis Comments
Rahul Gandhi: బీజేపీని మట్టికరిపించేందుకు విపక్షాల భేటీ..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పాట్నాలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ పాలనా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో(Elections) బీజేపీ(BJP)ని మట్టికరిపించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్(Bhihar CM Nithish kumar) ఆధ్వర్యంలో శుక్రవారం విపక్షాలు భేటీ అయ్యాయి. ఆ భేటీకి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశాన్ని విభజించే కుట్ర చేస్తోందని తెలిపారు. బీజేపీ మన దేశంలో విద్వేషాన్ని పెంచుతుంటే, తాము ప్రేమను పంచుతున్నామన్నారు. దేశంలో ఓ సిద్ధాంతంపై యుద్ధం జరుగుతోందని, అన్ని రాష్ట్రాల్లోనూ బీహార్ ప్రజలు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహారో ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి ఘోర పరాభవం ఎదురైందని, పేదల పక్షాన నిలిచినందుకే తాము విజయం సాధించినట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. బీజేపీ అత్యంత సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తోందని, కాంగ్రెస్ సామాన్యుడి వెంట నిలిచిందని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని, బీజేపీకి పరాభవం తప్పదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
పాట్నాలోని బీహార్ సీఎం నితీష్ కుమార్(Bhihar CM Nithish kumar) నివాసంలో విపక్ష నేతలు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేతలు(యుబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌తో పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, జేఎంఎం, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జెడీ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.