రాజస్థాన్‌లోని బికనీర్ ఖజువాలా కోచింగ్‌లో చదువుతున్న దళిత యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ తేజస్వానీ గౌతమ్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ ఖజువాలాలో విడిది చేశారు.
గుజరాత్‌లోని తంకారలో కోతులు పానీపూరిని ఆస్వాదిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో కోతి పానీపూరి దుకాణం వద్దకువచ్చి దానిపై కూర్చుంది, పానీపూరి అమ్మే అతను గోల్‌గప్పాలను సిద్ధం చేసి కోతికి అందించగా అది ఇష్టంగా తినడం కనిపిస్తోంది.
మణిపూర్‌లో హింస ప్రారంభమై నెలన్నర గడిచినా అదుపులోకి రాలేదు. బుధవారం కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇది కాకుండా, హింసను దృష్టిలో ఉంచుకుని, జూలై 1 వరకు పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్‌పై నిషేధాన్ని కూడా జూన్ 25 వరకు పొడిగించారు.
దాదాపు ఏడు నెలల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం లాభాల్లో కొనసాగుతోంది.
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ యువ ఇంజనీర్ చెంపచెల్లుమనిపించారు. మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఇద్దరు ఇంజనీర్లను విచారించి, వారిలో ఒకరిని కొట్టగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
తెలంగాణను రుతుపవనాలు తాకాయి. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల తాకిడి వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.