తెలంగాణను రుతుపవనాలు తాకాయి. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల తాకిడి వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
రుతుపవనాల(Monsoon) రాక కోసం తెలుగు రాష్ట్రాలు(Telugu States) వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఏపీ(AP)లోకి నిన్న రుతుపవనాలు ప్రవేశించగా తాజాాగా నేడు తెలంగాణ(Telangana)ను తాకాయి. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాపించాయి. త్వరలోనే ఇవి అంతటా విస్తరించనున్నాయి. మంగళవారం తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. జనం, రైతులు(Formers) వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎండల వల్ల ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వరుణ దేవుని కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న క్రమంలో వాతావరణ శాఖ(Weather Department) తీపికబురు చెప్పింది. రుతుపవనాలు(Monsoon) తెలంగాణను తాకాయని వెల్లడించింది.
రుతుపవనాల(Monsoon) ప్రవేశం వల్ల చెన్నైలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. వర్షాలకు రైల్వే ట్రాక్లు చాలా వరకూ నీట మునిగాయి. దీంతో రైల్వేశాఖ అప్రమత్తమయ్యి చెన్నై సెంట్రల్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించి కొనసాగిస్తోంది. రుతుపవనాల తాకిడి వల్ల దక్షిణ తెలంగాణలోని ఏపీ- తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.