International Yoga Day: Significance, History Of Yoga
International Yoga Day 2023: కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి భారతదేశంలో యోగా (Yoga) ఉంది. రుగ్వేదాలు, పౌరాణిక పుస్తకాలలో యోగా గురించి రాసి ఉంది. యోగాకు ముందు గురువు శివుడు అని పురాణాలు చెబుతున్నాయి. మనస్సు, శరీరం మధ్య సామరస్యాన్ని తీసుకురావడానికి యోగా పనిచేస్తోంది. యోగా బాగా శ్వాస తీసుకోవడం ఎలానే నేర్పుతుంది. మన శక్తిని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో చెబుతుంది. మనసు ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో నేర్పిస్తోంది.
ఐక్యం
యోగా (Yoga) అంటే మనిషి చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. యోగా (Yoga) అంటే ఐక్యం అని అర్థం వస్తోంది. అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా. మానవుని అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయికే యోగా (Yoga). యోగసనాలు చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
గుండెకు మేలు
యోగా (Yoga) చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి శరీరాకృతి కూడా వస్తోంది. అలసట తగ్గుతుంది. యోగా చేయడంతో గుండెకు మేలు జరుగుతుంది. బీపీ ఉంటే తగ్గుతుంది. గుండెపోటు, షుగర్, ఒత్తిడి స్థాయి గణనీయంగా తగ్గుతుంది. యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు, యోగా ముద్రలు ఉన్నాయి. ఏరోబిక్ వ్యాయామాలు ఊపిరి బిగబట్టే సామర్థ్యం పెంచుతాయి. కొందరు చిన్న పని చేసినా.. కొద్దీ దూరం నడిస్తే ఆయాస పడుతారు. ఊపిరి వేగంగా కొట్టుకుంటుంది. ఇలాంటి వారు వ్యాయామాలు చేయాలన్నా ఇబ్బందులు తప్పవు. సో.. ఇలాంటి వారికి కొన్ని భంగిమలు ఉన్నాయి.
నౌకాసనం
వ్యక్తుల్లోని శక్తి, సామర్థ్యాలను పెంచే ఆసనం. ఒత్తిడిని తగ్గించడంతోపాటు శారీరక సమస్యలను ఎదుర్కోవడంలో సాయపడుతుంది. ఆసనం వేయడంతో తుంటి కీళ్లు, కాళ్లు బలోపేతం అవుతాయి. చేతులు, తొడలు, భుజాలలో కండరాలను బలపరుస్తాయి. ఉదర అవయవాలు, కండరాలు ఉత్తేజితం అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర స్థిరత్వం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది.
బాలసనం
ఛాతీ, వీపు, భుజాలలో ఒత్తిడిని తగ్గించడం ద్వారా కండరాలకు విశ్రాంతి ఇస్తోంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడమే కాకుండా మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. అలసటతో బాధపడుతుంటే సాయపడుతుంది. వెన్ను, తుంటి, తొడ, చీలమండ భాగాలలో సాగతీత, అసౌకర్యం తగ్గించడంలో సాయపడుతుంది.
ఉస్త్రాసన
ఉస్త్రాసన వేయడం ద్వారా ఛాతీ విస్తరిస్తోంది. దీంతో శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఆసనం వేయడం ద్వారా భుజాలు, వీపు, తుంటి, నడుము, కండరాలు సాగదీయడం, బలోపేతం చేయడం, ఉదరప్రాంతాన్ని విస్తరించడం ద్వారా జీర్ణక్రియ ప్రోత్సహిస్తోంది. మలబద్దకం సమస్య నివారిస్తోంది. వెన్నుపూసకు విశ్రాంతిని ఇస్తోంది. నడుము నొప్పిని తగ్గిస్తోంది. శరీర భంగిమను మెరుగుపరుస్తోంది. తొడ భాగంలో కొవ్వును తగ్గిస్తోంది.