బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ప్రమాదానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని విచారణ బృందం ప్రశ్నించింది. అప్పటి నుంచి సిగ్నల్ జేఈ తన కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.