పవిత్ర కేదార్నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవిత్రమైన కేదార్ నాథ్ ఆలయం(Kedarnath Temple) గర్భగుడిలో అపచారం చోటుచేసుకుంది. శివలింగం(Shivalingam)పై ఓ మహిళ కరెన్సీ నోట్లు చల్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. శివలింగంపై నోట్లు చల్లిన మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే నోట్లు చల్లిన భక్తురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది.
కేధార్నాథ్ గర్భగుడిలో శివలింగంపై నోట్లు చల్లుతున్న మహిళ వీడియో:
వీడియో(Video)లో శివలింగానికి పక్కన కుడివైపున నిలబడిన మహిళ కేదారేశ్వరుడి(Kedarnath)పై నోట్లు చల్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పురోహితులు మంత్రాలు పఠిస్తుండగా ఈ అపచారం జరిగింది. గర్భగుడిలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం అని తెలిసినా కూడా ఆమె శివలింగం(Shivalingam)పై కరెన్సీ నోట్లు చల్లుతుంటే ఎవరూ వారించకుండా ఉండిపోయారు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేదార్ నాథ్ ఆలయం(Kedarnath Temple)లో ఆ మహిళ ప్రవర్తనపై, ఆలయ సిబ్బంది, అధికారులపై దేశ వ్యాప్తంగా భక్తులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటనపై రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బద్రీనాథ్ – కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్(Video Viral) అవుతున్నాయి.