రాజస్థాన్ (Rajasthan) బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు (floods)వెల్లువెత్తాయి .బార్మర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. బార్మర్ జిల్లా(Barmer District) లోని ధౌరిమన్న పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోవడంతో ఇళ్లలో చిక్కుకుపోయిన 20 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. జలోర్‌లోని భిన్మల్ పట్టణంలోని వరద ప్రభావిత ఓడ్ బస్తీలో చిక్కుకుపోయిన 39 మంది పౌరులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర విపత్తు సహాయ దళం (SDRF) కమాండెంట్ రాజ్‌కుమార్ గుప్తాతెలిపారు.
గంగాసర గ్రామంలోని చెరువులో ఇద్దరు సోదరులు మునిగి మృతి చెందినట్లు బార్మర్ సేవదా పోలీస్ స్టేషన్ (Sevada Police Station) అధికారి హన్సారాం వెల్లడించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.బఘోటా గ్రామంలో భారీవర్షాల వల్ల ప్రేమ్‌సింగ్ రాజ్‌పుత్ (45) మృతి చెందారు. కెల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇంటి బాల్కనీ లాలీ బాయి (48)పై పడి మృతి చెందారని రాజ్‌సమంద్ పోలీసు కంట్రోల్ రూమ్ తెలిపింది. 59 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు