ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్‌మెంట్ బృందం అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని, మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది.
ప్రగతి మైదాన్‌లో ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు నిర్మించిన సొరంగంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయిలెట్లో కెళ్లి గడియ వేసుకున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు. రోడ్డు మార్గంలో 500 కార్లతో మంది, మార్బాలాన్ని వేసుకొని మరీ వెళుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే సమయంలో ఆయా చోట్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పలు చోట్ల 200 మందికిపైగా టూరిస్టులు, స్థానికులు చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
మూలధన వ్యయం ఖర్చు చేయడంలో ఏపీ చివరి స్థానంలో నిలిచింది. 25 రాష్ట్రాలతో కూడిన జాబితాను బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏపీ లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
ఏపీలో తొలిసారి సరోగసీ ద్వారా ఓ దూడ జన్మించింది. తిరుపతి వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయగా విజయవంతంగా దూడ జన్మించింది. ఈ పద్దతిలో మరో ఐదేళ్లలో 500 దూడలను పుట్టించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
ఈ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించి ట్రాక్‌పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా ల...