»200 Tourists Trapped In Floods In Himachal Pradesh
Himachal Pradesh:లో వరదలు..చిక్కుకున్న 200 మంది టూరిస్టులు
హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పలు చోట్ల 200 మందికిపైగా టూరిస్టులు, స్థానికులు చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని మండి జిల్లాలో వరదల(floods) కారణంగా 200 మందికి పైగా పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారు. ఎడతెరిపి లేకుండా వస్తున్న వరదల కారణంగా పలు ప్రాంతాల్లో వీరు చిక్కుకున్న పోలీసులు ఆదివారం తెలిపారు. గల్లంతైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మండి జిల్లాలోని బగిపుల్ ప్రాంతంలోని ప్రశార్ సరస్సు సమీపంలో ఆకస్మికంగా వరద వచ్చింది. దీంతో మండి ప్రషార్ రోడ్లోని బగ్గీ బ్రిడ్జ్ దగ్గర పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా చిక్కుకుపోయారు.
దీంతోపాటు బాఘీ వంతెన పరిధిలో కూడా అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పరాశర్కు వెళ్లే రహదారి(road) మూసివేయబడిందని పోలీసులు(police) పేర్కొన్నారు. దీని కారణంగా చంబా నుంచి విద్యార్థులను తీసుకువెళుతున్న బస్సుతో సహా, పరాశర్ నుంచి తిరిగి వస్తున్న అనేక వాహనాలు చిక్కుకున్నాయని అధికారులు చెప్పారు. ఈ రాత్రికి రోడ్డు తెరుచుకునే అవకాశం లేనందున వారు రాత్రిపూట బస చేసేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పండో-మండి జాతీయ రహదారిపై ఛార్మిలే, సత్మిలే మధ్య, అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారిని మూసివేశామని, దానిని తెరవడానికి సమయం పడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. కమాండ్ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో మూసివేయబడిన కటోలా మీదుగా మండి-కులు రహదారి ఈరోజు తెరుచుకునే అవకాశం ఉందన్నారు.
#WATCH | #HimachalPradesh | Traffic movement on National Highway 3 in Mandi, near Hanogi Mata Temple, halted due to flash floods