పశ్చిమ బెంగాల్‌లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించి ట్రాక్‌పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా లైన్లో పలు రైలు రైళ్లను నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ గూడ్స్ రైలు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Collision occurred between goods train near ONDAGRAM station(WEST BENGAL) today at 4 AM. A goods train entered loop line instead of main line and collided with another stationary goods train , Same as Balasore Train Accident@Tamal0401@AshwiniVaishnawpic.twitter.com/NShseTVi9n