ప్రధాని మోడీ(modi) జూలై 12న తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేసేందుకు రానున్నట్లు తెలిసింది.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఎదురుగా ఉన్న టన్నెల్లో జూన్ 24న జరిగిన దోపిడీ ఘటన మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఢిల్లీలోని ఒక ఫెర్టిలిటీ క్లినిక్ గర్భం కోసం తప్పు స్పెర్మ్‌ను ఉపయోగించడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంలో జాతీయ వివాదాల పరిష్కార వినియోగదారుల కమిషన్ (NCDRC) తన తీర్పును ఇచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి గానూ దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
నాసా శాస్త్రవేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూత్రం, చెమట నుంచి మంచినీటిని తయారు చేసే విధానం సక్సె అయ్యిందని నాసా ప్రకటించింది. దీని వల్ల భవిష్యత్ తరాలకు నీటి సమస్య తీరుతుందని తెలిపింది.
మునిసిపల్ బృందాలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇలా ఒక్క సారిగా పోలీసులు, కార్పోరేషన్ వెతకడం చూసి జనాల్లో కలకలం రేగింది. అయితే సోమవారం సాయంత్రం ఈ బృందాలు మీరట్ డివిజనల్ కమిషనర్ సెల్వ కుమారి జెని కలవడంతో అసలు విషయం బయటపడింది.
మమత హెలికాప్టర్ అకస్మాత్తుగా ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. దాని కారణంగా అది కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. వెంటనే ఫైలట్ అప్రమత్తమై సిలిగురిలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.
ఓ వ్యక్తి 28 ఏళ్ల క్రితం బస్సు నడుపుతుండగా గేదెను ఢీకొన్నాడు. అప్పట్లో గేదె మరణించిన విషయంలో అతనిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ఇప్పుడు 83 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ముంబైలో ఒకతను ఏడుగురు చిన్నారులతో కలిసి బైక్ మీద వెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ బైకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీని సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలో గోల్డ్ మైనింగ్(gold mining) నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చోటనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాల కోసం nmdc మొదటి గోల్డ్ బ్లాక్‌లో 61 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.