»Fresh Water From Sweat And Urine Nasas Experiment Is A Success
NASA: చెమట, మూత్రం నుంచి మంచినీరు..నాసా ప్రయోగం సక్సెస్
నాసా శాస్త్రవేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూత్రం, చెమట నుంచి మంచినీటిని తయారు చేసే విధానం సక్సె అయ్యిందని నాసా ప్రకటించింది. దీని వల్ల భవిష్యత్ తరాలకు నీటి సమస్య తీరుతుందని తెలిపింది.
అంగారక గ్రహం(Mars planet)పైకి వ్యోమగాముల(Astronauts)ను పంపేందుకు నాసా(Nasa) సిద్ధమవుతోంది. అయితే అందుకు ఇంకా ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. చంద్రుడి(Moon) మీదుగా వ్యోమగాములు అంగారకుడిపైకి చేరడానికి చాలా కాలం పడుతుంది. అంతవరకూ రాకెట్(Rocket)లో వారి అవసరాలకు నీటిని పంపేందుకు భారీగా చోటు ఉండాలి. అది కుదరని పని. అందుకే వ్యోమగాముల మూత్రం, చెమట నుంచే నీటిని తయారు చేసే ప్రక్రియపై నాసా ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
ఎట్టకేలకు నాసా(Nasa) ప్రయోగం సక్సెస్ అయ్యింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో మూత్రాన్ని(Urin) నీటిగా మార్చే ప్రయోగం చేపట్టారు. కేవలం నీటితోనే కాకుండా ఆహారం, గాలి మొదలైన వాటిని రీసైకిల్ చేసి వాటర్(Water) తయారు చేశారు. ఒక అత్యాధునిక డీహ్యుమిడిఫైర్.. వ్యోమగాముల(Astronauts) చెమట, శ్వాసక్రియల ద్వారా తేమను గ్రహిస్తుంది. మూత్రాన్ని శుద్ధి చేసేందుకు కూడా శాస్త్రవేత్తలు యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ(యూపీఏ)ని క్రియేట్ చేశారు.
బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ (BPA) ద్వారా పనికిరాని నీటి(Water)ని కూడా శుద్ధి చేయవచ్చని నాసా(Nasa) సైంటిస్టులు తెలిపారు. క్రిస్టోఫర్ బ్రోన్ అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగానికి నాయకత్వం వహించారు. వ్యోమగాములు(Astronauts) వారు వాడుకున్న నీటి నుంచే మళ్లీ మళ్లీ 98 శాతం నీటిని ఈ ప్రక్రియల ద్వారా పొందగలుగుతారని ఆయన తెలిపారు. దీని వల్ల భవిష్యత్తు తరాలకు ఓ పెద్ద సమస్య తీరుతుందని వెల్లడించారు.