»Meerut Police Searched 500 Houses In 25 Hours To Find Commissioner Missing Dog In Uttar Pradesh
Dog: తప్పి పోయిన కమీషనర్ కుక్క.. 25 గంటల్లో 500 ఇళ్లలో సోదాలు
మునిసిపల్ బృందాలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇలా ఒక్క సారిగా పోలీసులు, కార్పోరేషన్ వెతకడం చూసి జనాల్లో కలకలం రేగింది. అయితే సోమవారం సాయంత్రం ఈ బృందాలు మీరట్ డివిజనల్ కమిషనర్ సెల్వ కుమారి జెని కలవడంతో అసలు విషయం బయటపడింది.
Dog: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా మొత్తం పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు మీరట్ నగరంలోని ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మునిసిపల్ బృందాలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇలా ఒక్క సారిగా పోలీసులు, కార్పోరేషన్ వెతకడం చూసి జనాల్లో కలకలం రేగింది. అయితే సోమవారం సాయంత్రం ఈ బృందాలు మీరట్ డివిజనల్ కమిషనర్ సెల్వ కుమారి జెని కలవడంతో అసలు విషయం బయటపడింది. తప్పిపోయిన కుక్క దొరికిందని ప్రకటించారు. 25 గంటల్లో దాదాపు 500 ఇళ్లల్లో సోదాలు చేసిన సెర్చ్ టీమ్‌లు విజయం సాధించాయి.
ఆదివారం సాయంత్రం కుక్క గల్లంతైంది
మీరట్ డివిజన్ కమిషనర్‌కు చెందిన సైబీరియన్ హస్కీ జాతి కుక్క ఎకో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో అదృశ్యమైంది. కుక్క కనిపించకుండా పోవడంతో కమిషనర్ నివాసంలో ఉంచిన సిబ్బంది, పోలీసులు దాదాపు 2 గంటల పాటు వెతికారు. కుక్క కనిపించకపోవడంతో ఎవరో కుక్కను తీసుకెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీని తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ జంతు సంరక్షణ అధికారి డాక్టర్ హర్పాల్ సింగ్ తన బృందంతో కమిషనర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది నుంచి పూర్తి సమాచారం తీసుకుని రెండేళ్ల వయసున్న ఎకో కుక్క ఫొటో తీసి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాడు.
8 బృందాలు ఇంటింటి ప్రచారం
హర్పాల్ సింగ్ పోలీసులతో కలిసి 8 సెర్చ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.ఇవి రాత్రంతా ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించాయి. ఉదయం 8 గంటల నుంచి డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో దాదాపు 500 ఇళ్లను తనిఖీ చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు కుక్క వచ్చింది. కమిషనర్ సెల్వ కుమారి జెని కుక్క ఎప్పుడు, ఎలా కనిపించకుండా పోయిందనే దాని గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పింది. కుక్క దానంతట అదే వెళ్లి తిరిగి వచ్చిందన్నారు.