If Kavita is good then vote for BRS.. If you are good then support BJP: Modi
PM Modi: తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రధాని మోడీ (PM Modi) నిప్పులు చెరిగారు. భోపాల్లో జరిగిన ‘మేరా బూత్.. సబ్సే మజ్బూత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ పర్యటనలో సీఎం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కుటుంబ పార్టీలు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ (PM Modi) ప్రసంగించారు.
బీజేపీకి కార్యకర్తలే పెద్ద బలం అని మోడీ (PM Modi) చెప్పారు. ఏసీ గదుల్లో కూర్చొని తాము ఆదేశాలు జారీచేయబోమని తేల్చిచెప్పారు. జనంతో కలిసి పోయేందుకు కఠిన పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేని ప్రచారం జరుగుతోన్న సమయంలో మోడీ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
ఇటు మహారాష్ట్ర పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఈ విధంగా మాట్లాడారు. తాము ఎవరికీ బీ టీమ్ కాబోబని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కోసం రెండు రోజులు పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మోడీ, కేసీఆర్ చేసిన కామెంట్స్ ఆ రెండు పార్టీలు వేర్వేరు అని స్పష్టమవుతోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు మాత్రం అదేం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.