»Kerala Man Locks Himself Up In Vande Bharat Express Trians Toilet Breaks Down Door And Arrested
VandeBharat: టికెట్ లేకుండా వందేభారత్ ఎక్కాడు.. టాయిలెట్ కెళ్లి తాళం వేస్కున్నాడు
కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయిలెట్లో కెళ్లి గడియ వేసుకున్నాడు.
VandeBharat: ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. వందేభారత్ రైలుకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కొందరు కేటుగాళ్లు వందేభారత్ రైళ్లపై నిరంతరం రాళ్ల దాడులు చేస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం, కానీ కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయిలెట్లో కెళ్లి గడియ వేసుకున్నాడు.
ఎంతకూ బయటికి రాకపోవడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు టాయిలెట్ డోర్ పగలగొట్టి అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన రైలులోని ఈ1 కోచ్‌లో చోటుచేసుకుంది. టీటీఈ తెలిపిన వివరాల ప్రకారం.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టాయిలెట్లోకి లాక్కెళ్లిన ప్రయాణికుడిని ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. మరుగుదొడ్డి తాళం తీసి పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ముంబైకి చెందిన వ్యక్తి అని రైల్వే పోలీసులు తెలిపిన సమాచారం. టాయిలెట్‌కు లోపల నుంచి తాళం వేసి కూర్చున్నాడు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. అనేక ప్రశ్నలకు అతని నుంచి సరైన సమాధానాలు లభించడం లేదని అధికారులు అంటున్నారు. ఆ వ్యక్తి వలస కూలీగా అనుమానిస్తున్నారు.