»Calf Born Through Surrogacy For The First Time Ivf Experiment In Cows Is A Success
TTD : తొలిసారి సరోగసీ ద్వారా జన్మించిన దూడ..ఆవుల్లో ఐవీఎఫ్ ప్రయోగం సక్సెస్
ఏపీలో తొలిసారి సరోగసీ ద్వారా ఓ దూడ జన్మించింది. తిరుపతి వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయగా విజయవంతంగా దూడ జన్మించింది. ఈ పద్దతిలో మరో ఐదేళ్లలో 500 దూడలను పుట్టించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
ఏపీ(AP)లో తొలిసారి సరోగసీ(Surrogacy) ద్వారా దూడ జన్మించింది. ప్రయోగాత్మకంగా ఆవుల్లో చేపట్టిన ఐవీఎఫ్(IVF) ప్రాసెస్ సక్సెస్ అయ్యింది. అంతరించిపోతున్న దేశీయ ఆవుల ఉత్పత్తిని పెంచేందుకు తొలిసారి శాస్త్రీయంగా సరోగేటెడ్ ప్రయోగాన్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చేశారు. ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా గిర్ ఆవు పిండాన్ని ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా షాహివల్ ఎంబ్రియోను ఒంగోలు జాతి ఆవుల్లో అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు.
గత ఏడాది ఐవీఎఫ్ టెక్నాలజీ(IVF Technology)తో ఆరోగ్యవంతమైన, అధిక ప్రొడక్టివిటీని ఇచ్చే దేశీయ ఆవుల ఉత్పత్తి కోసం వెటర్నరీ యూనివర్సిటీలో రూ.3.8 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 350 సరోగేటెడ్ డూదలను పుట్టించడమే తమ లక్ష్యమని తిరుపతి వెటర్నరీ వర్సిటీ(Tirupathi veterinary University) వెల్లడించింది. ప్రస్తుతం 94 సరోగేటివ్(Surrogative) ఆవులను సిద్ధం చేశామని, మరో 18 సరోగేట్ యానిమల్స్ టెస్టింగ్‌లో ఉన్నట్లు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మనాభరెడ్డి తెలిపారు.
సరోగసీ(Surrogacy) ద్వారా మరో రెండు రోజుల్లో ఇంకో రెండు దూడలకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయం(Tirumala)లో రోజుకు 2500 లీటర్ల పాలు అవసరం కాగా, అందులో రోజుకు 500 దేశీయ ఆవుపాలు అవసరం ఉందని తెలిపారు. సరోగసీ కోసం మరో 5 మంది దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharmareddy) వెల్లడించారు. రామమయం ట్రస్ట్ వాళ్ళు 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవులు డొనేట్ చేసినట్లు తెలిపారు. మరో 5 ఏళ్లలో టిటిడి గోశాలలో వెయ్యి ఆవుల్ని సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.