Viral Video: చావులో కూడా వీడని ప్రేమ బంధం..కన్నీళ్లు తెప్పిస్తోన్న పక్షుల వీడియో
రెండు పక్షులు కలిసి బతికాయి. కానీ విధి వారిని విడదీసేందుకు ప్రయత్నించింది. ఓ పక్షి ప్రాణాలు పోవడంతో మరో పక్షి తట్టుకోలేకపోయింది. ఆ పక్షిపైనే తలవాల్సి మరో పక్షి కూడా ప్రాణాలు వదిలింది. ప్రేమకు నిదర్శనమైన ఈ పక్షుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమ(Love) చాలా పవిత్రమైంది. ఆ ప్రేమ మనుషుల్లోనే కాదు ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది. జంతువులు(Animals), పక్షులు(Birds) కూడా ప్రేమలో పడతాయి. మనుషుల ప్రేమకన్నా వాటి ప్రేమ ఎంతో అందంగాను, సత్యంగాను ఉంటుంది. ప్రస్తుతం పక్షుల ప్రేమకు నిదర్శనమైన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. మనసు కలచివేసే ఈ వీడియోను చూసిన వారు కన్నీరుపెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో(Viral Video)లో ఓ పక్షి చనిపోయి ఉంది. ఆ పక్షికి పక్కనే ఇంకో పక్షి(Bird) రోదిస్తూ ఉంటుంది. అది బాధతో చనిపోయిన ఉన్న పక్షిపై తలపెట్టి ఏడుస్తుంటుంది. ఓ వ్యక్తి అక్కడ చనిపోయి పడి ఉన్న ఆ పక్షిని కాస్త పక్కకు జరపడంతో బతికి ఉన్న మరో పక్షి దానిని వీడలేక పోతుంది. చనిపోయిన పక్షినే హత్తుకుని అలా ఉండిపోతుంది. తలవాల్చి ఆ పక్షి ఆ క్షణమే తుదిశ్వాస విడుస్తుంది. గుండెల్ని పిండేసి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
తన భాగస్వామితో పాటే ఆ పక్షి(Bird) ప్రాణాలు విడిచిన వీడియోను సుశాంతనంద తన ట్విట్టర్(Twitter) అకౌంట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో(Video)ను చూసిన నెటిజన్లు బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమను వర్ణించలేమని, నిజమైన ప్రేమకు ఈ ఘటనే నిదర్శనమని ఎమోజీలు పెడుతున్నారు.