Viral Video: తన బిడ్డను రక్షించుకోవడానికి హైనాను తరిమిన జిరాఫీ
ఓ జిరాఫీ హైనాతో పోరాడి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. మైదాన ప్రాంతంలో ఓ జిరాఫీ పిల్ల కూర్చొని ఉంది. అది గమనించిన ఓ సారిగా దూకి దాని మెడ పట్టుకుంటుంది.
Viral Video: ప్రపంచంలో ఎంత ఖర్చు చేసినా దొరకనిది అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన ఆ క్షణంలో అమ్మ ఉంటే అదో ధైర్యం. నిరంతరం తన కన్న బిడ్డ బాగోగులను కోరుకునే వారిలో అమ్మ తర్వాతే ఎవరైనా. ఆపద కాలంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పిల్లలను కాపాడుకుంటుంది. ఇది కేవలం మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుందని ఓ జిరాఫీ నిరూపించింది. హైనాతో పోరాడి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. మైదాన ప్రాంతంలో ఓ జిరాఫీ పిల్ల కూర్చొని ఉంది. అది గమనించిన ఓ సారిగా దూకి దాని మెడ పట్టుకుంటుంది.
తప్పించుకోవడానికి ఆ జిరాఫీ పిల్ల ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దగ్గర్లోనే ఉన్న జిరాఫీ తల్లి.. ఆపదలో ఉన్న తన బిడ్డను చూసి పరిగెత్తుకు వచ్చి హైనాపై దాడి చేసింది. దీంతో హైనా పారిపోయింది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. తనకంటే బలవంతమైందని తెలిసి కూడా.. తన బిడ్డను కాపాడేందుకు జిరాఫీ సాహసించింది. పోరాట తెగువను నెటిజన్లు అభినందిస్తున్నారు. గేబ్రియేల్ కర్నో ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో వ్యూస్ లభించాయి. తల్లి సాహసం అద్భుతమని ఓ యూజర్ ప్రశంసించగా, పిల్లల కోసం తల్లులు ఎంతకైనా తెగిస్తారని పలువురు యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.