»Pm Modi Us Visit This Is Not Time For War Pm Modi Gave Advice To Putin From Us Capital
PM Modi: ఇది యుద్ధానికి సమయం కాదు.. పుతిన్‌కు ప్రధాని మోడీ సలహా
పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబయిలో 9/11, 26/11 దాడులు జరిగిన దశాబ్దానికి పైగా ఉగ్రవాదం ఇంకా ప్రపంచానికి ముప్పుగా ఉందని ఆయన అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు అనేక రకాలుగా ప్రత్యేకత ఉంది. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, అమెరికాతో సంబంధాలపై ఆయన మాట్లాడారు. ఇది కాకుండా పాకిస్తాన్‌కు, చైనాకు ఉగ్రవాదంపై, ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాకు ప్రధాని చాలా ముఖ్యమైన సందేశం అందించారు.
నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గ్లోబల్ సౌత్ దేశాలే ఎక్కువగా నష్టపోయాయని ప్రధాని మోడీ అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది యుద్ధానికి సమయం కాదని, ఇది ప్రజలను బాధపెడుతుందని అన్నారు. ఏ సమస్య వచ్చినా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. అదే సమయంలో పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబయిలో 9/11, 26/11 దాడులు జరిగి దశాబ్ధం గడుస్తోంది. అయినా ఉగ్రవాదం ఇంకా ప్రపంచానికి ముప్పుగా ఉందన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువనీ, దానిని ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులన్నింటినీ మోడీ నియంత్రించాలన్నారు.
అంతకుముందు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేసి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ముందుగా న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడి నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చారు.