గదర్2 మూవీ థియేటర్లో ప్రదర్శితం అవుతుండగా ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్‌ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
ప్రపంచ ఆసియా కప్‌లో భాగంగా ఇండియన్ టీమ్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఉత్తీర్ణులైన వారికి తుది జట్టులో స్థానం ఉంటుంది.
విమానంలో ప్రయానం అంటే అందిరికి సారదానే ఉంటుంంది కాని అది సాధారణ ప్రజలకు అందదని చాలా మంది ప్రయాణాలకు దాని వైపు కూడా తొంగి చూడారు. అలాంటి వారికోసమే స్పెస్‌జెట్ ఎయిర్‌లైన్ సంస్థ కేవలం రూ.1515కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గల స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.