దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది.
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ విక్షించారు. అనంతరం డైరెక్టర్‌తో మాట్లాడి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత అనే కొత్త బిల్లు దేశంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఐపీసీ సెక్షన్లో ఉన్న లోటుపాట్లను దీనిలో సవరించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మోసం చేసి పెళ్లి చేసుకోవడం సహా పలు శిక్షలలో పదేళ్ల జైలు శిక్షను ఖారారు చేసినట్లు ప్రకటించారు.
కొంత మందికి ప్రతిభ ఉన్నా తగిన వనరులు లేవని ఏం చేయకుండా అలా కూర్చిండిపోతారు. కానీ ఈ వ్యక్తికి ఉన్న ట్యాలెంట్‌కు పేదరికం అడ్డం కాలేదు. అందుబాటులో ఉన్నవాటితో తన మెదడుకు పని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఈ మేరకు నాగాలాండ్ మినిస్టర్ ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో ఓ ప్రయాణికుడు ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు. అక్కడ ఉండి అరవడం ఏంటీ..? ఫుడ్ తిని కనీసం వెస్టేజ్ పారేయకుండా అలా పెట్టడం ఏంటీ అని అడుగుతున్నారు.
ఢిల్లీ స్కూల్లో విద్యార్థులు ఫోన్ వాడకంపై నిషేధం విధించింది. దీని ద్వారా జరిగే అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న డైరెక్టర్స్ పిల్లల తల్లిదండ్రులను ఇందుకు సహకరించాలని కోరారు.
పంజాబ్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.