చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ తీసిన జాబిల్లి తొలి ఫొటోలను ఇస్రో విడుదల చేసింది
కారు బానెట్ పై ఉన్న మహిళను ఈడ్చుకెళ్లిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే వారిని రక్షించేందుకు అక్కడి కోచింగ్ సెంటర్లు ఓ అధునాతన ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రయోగం ఫలిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చని భావిస్తున్నారు.
ఎయిర్ ఇండియా(Air India) దేశీయ, అంతర్జాతీయ మార్గాల కోసం నాలుగు రోజుల పాటు స్పెషల్ టిక్కెట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1470కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ఈ స్పెషల్ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
ఓ ఉపాధ్యాయుడు తాను బోధించే క్రమంలో భాగంగా చదువుకున్న ప్రజాప్రతినిధులకు మాత్రమే ఓటు వేయాలని విద్యార్థులకు సూచించాడు. అంతే ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని ఆ సంస్థ నిర్వహకులు తొలగించారు. ఇది తెలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(arvind kejriwal) వారిని ప్రశ్నించారు.
ఒక గ్రామంలోని బావిలో పడిపోయిన ఎద్దును కాపాడేందుకు పోయి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఆ క్రమంలో మరో ఇద్దరిని రక్షించగా..బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు NDRF సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషాదఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది.
ఇకపై సిమ్ కార్డు తీసుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కేవైసీ పూర్తయిన తర్వాతే సిమ్ మంజూరు అవుతుంది. తాజాగా సిమ్ కార్డు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
భారత ఆర్మీ స్పెషల్ జెట్‌ప్యాక్ సూట్‌లు ధరించనుంది. తాజాగా సైనికులు ఈ ప్రత్యేక సూట్‌ను టెస్ట్ చేశారు. గాలిలో ఎగురుతూ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. చాలా మందిని ఇమిగ్రేషన్ చెక్ పేరుతో ఇబ్బంది పెట్టారు. మరికొందరిని సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు.
మహిళల కోసం ప్రత్యేక గన్‌ను ఓ సంస్థ సిద్ధం చేసింది. ఆ గన్‌కు ప్రబల్ రివాల్వర్ అని నామకరణం చేశారు. త్వరలోనే ఆ ప్రత్యేక గన్ అందుబాటులోకి రానుంది.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనుసుదోచుకోవడమే కాదు ఏకంగా హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఓ సినిమా అవకాశాన్ని కొట్టేసింది. తన డెబ్యూ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది.. కానీ ప్రమోషన్లో ఎక్కడ కనిపించలేదు. రీసెంట్‌గా నిర్వహించిన చిట్ చాట్‌తో ఫ్యాన్స్‌తో అసలు విషయాన్ని పంచుకుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా స్తంభించిన జనజీవనం. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణవ్యవస్థ. భారీ వరదల కారణంగా రైల్వే ట్రాక్‌పై మట్టి అంత కొట్టుకుపోయి రైల్‌ట్రాక్స్ గాల్లో తేలి ప్రమాదకరంగా మారాయి. చూడడానికే ఒల్లు గగుర్లుపొడిచేలా ఉన్న ఈ దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం జైలర్ సినిమా కలెక్షన్లను చూస్తే ట్రేడ్ పండితులకే మైండ్ పోయేలా ఉంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్‌స్టార్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఇక తమిళనాడులో అత్యంత వేగంగా రూ.150 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
కింగ్ ఫిషర్ 10 లక్షల బీర్ బాటిళ్లులను మైసూరు సీజ్ చేశారు