భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్ 3 కీలక దశకు చేరింది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ఈ ల్యాండర్ (Lander) ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. తాజాగా ఈ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలాన్ని ఫొటో తీసింది. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కొద్దిసేపటి కిందటే రిలీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీన ఈ ఫొటోను తీసింది చంద్రయాన్ 3 ల్యాండర్. అతి సమీపం నుంచి జాబిల్లి (Jabilli) ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ల్యాండర్‌కు అమర్చిన హై-డెఫినిషన్ కెమెరా తీసిన ఈ ఫొటోల్లో చందమామ ఉపరితలంపై ఉన్న కొండలు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇమేజెస్ అన్నింటినీ కలిపి ఓ వీడియోను తయారు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు(Scientists). 31 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
గతంలో నాసా (NASA) సహా వేర్వేరు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థలు గుర్తించిన ఎత్తయిన కొండలు, లోతైన అగాథాలు, వాటికి పెట్టిన పేర్లతో సహా ఈ వీడియోలో వివరించారు. ఫ్యాబ్రి, హర్ఖెబి జే, గెర్డానో బ్రూనో..లను గుర్తించారు.కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్ (Crash landing) కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది.
ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకున్నారు.చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ (Lander Module) జాబిల్లికి మరింత చేరువైంది. శుక్రవారం సాయంత్రం చేపట్టిన డీబూస్టింగ్ (వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యంగానే ఉందని వెల్లడించింది. తాజా విన్యాసంతో ల్యాండర్ మాడ్యూల్ (module) తన కక్ష్యను 113 km x 157 km తగ్గించుకుంది. రెంబో బూస్టింగ్ (Deboosting) ప్రక్రియ ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కానుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపనుంది.
చదవండి : Hussain Malik : భర్త తీవ్రవాది.. భార్య పాకిస్తాన్ కేంద్ర మంత్రి?