సాధారణంగా రైలు వెళ్తుంటే రైల్వే క్రాసింగ్ (Railway crossing) వద్ద గేటు పడుతుంది. అక్కడ ఉన్న వాహనాలన్నీ ఆగిపోయి.. రైలు వెళ్లిన తర్వాతే వెళ్తాయి. అయితే ఇక్కడ అలా జరగలేదు. పట్టాలపై ట్రాఫిక్ జామ్ (Traffic jam) కావడంతో అక్కడ ఉన్న వాహనాలు అన్నీ వెళ్లిపోయిన తర్వాత ట్రైన్ వెళ్లింది. పట్టణాలు, నగరాల్లో ఉండేవారికి ట్రాఫిక్ కష్టాలు షరామాములుగానే ఉంటాయి. బైక్ మీద వచ్చినా కారులో వెళ్లినా బస్సు, ఆటో ఇలా ఏ వాహనంలో రోడ్డు మీదికి వెళ్తే.. తప్పకుండా ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. ఇక రద్దీ ప్రాంతాలు, రద్దీ సమయాల్లో అయితే గంటల పాటు వాహనాల మధ్యే కాలం గడపాల్సి వస్తుంది.అయితే రోడ్డు మీద వెళ్లే వాహనాలకు అయితే ట్రాఫిక్ కారణంగా నిలిచిపోతాయి.
కానీ పట్టాలపై వెళ్లే రైలు కూడా.. ఈ రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాఫిక్ కారణంగా ఆగిపోయింది. దీంతో అటు..ట్రైన్లో ఉన్న ప్రయాణికులు.. రోడ్డుపై ఉన్నవారు ఈ ట్రాఫిక్ కారణంగా నరకయాతన అనుభవించారు. యూపీ బనారస్(Banaras)లోని రైల్వే క్రాసింగ్‌పై రైలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బనరస్లో రోడ్డుపై రైల్వే క్రాసింగ్ దగ్గర భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఈ సమయంలోనే రైల్వే క్రాసింగ్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (Express train) ట్రాఫిక్ కారణంగా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ (Funny comments) చేస్తున్నారు. “ట్రాఫిక్‌లో చిక్కుకున్న రైలును మీరు ఎప్పుడైనా చూశారా?” అని వీడియోను షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో మాత్రమే జరుగుతాయని కామెంట్స్ చేస్తున్నారు.