»Independence Day These Are The Prime Ministers Who Have Given Speeches At Red Fort
Independence Day : ఎర్రకోట వద్ద ఎక్కువసార్లు ప్రసంగాలు చేసిన ప్రధానులు వీరే
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) సంబరాలు వేడుకగా సాగాయి. ప్రధాని మోదీ (Pm modi) ఎర్రకోట (Errakota) వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ 10వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. ఈ సందర్భంగా కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. దాదాపు గంటర్నర పాటు ఆయన మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్లలో ఎర్రకోటపై ఎక్కువ సార్లు ప్రసంగించిన వారిలో ప్రధాని మోదీ కంటే ముందుగా మరో ఇద్దరు ప్రధానులున్నారు.
దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ (Jawahar Lal Nehru) ప్రధాని హోదాలో 17 సార్లు ఎర్రకోట (Errakota) వేదికగా జాతిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని వినిపించారు. ఆయన తర్వాత ఇందిరా గాంధీ నిలిచారు. ఇందిరా గాంధీ (Indira Gandhi) 16 సార్లు ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. ఆ తర్వాత యూపీఏ హయాంలో పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ (Manmohan singh) 10 సార్లు ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. ఆ ముగ్గురూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానులే కావడం మరో విశేషం.
ఇకపోతే కాంగ్రెసేతర ప్రధానుల్లో తాజాగా నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు 10వ సారి ప్రసంగించి అప్పటి మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేశారు. 1947 నుంచి 1963 వరకూ కూడా ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ కొనసాగారు. ఎర్రకోటపై ఆయన 17 సార్లు తన ప్రసంగాన్ని వినిపించారు. జాతినుద్దేశించి మాట్లాడిన వారిలో ఆయనే ఎక్కువగా సార్లు మాట్లాడటం విశేషం. ఇక ఆయన తర్వాత ఇందిరా గాంధీ 1966 నుంచి 1976 మధ్యన 11సార్లు ప్రసంగించారు. మళ్లీ 1980 నుంచి 1984 అంటే ఆమె మరణించిన ఏడాది వరకూ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. 2014లో నుంచి ఇప్పటి వరకూ ప్రధాని మోదీ 10 సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు.