పుణెకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని పొందారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్ని రోజులు కార్యాలయానికి సెలవు పెట్టుకున్నారని ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)ను కోరారు.
చంద్రుడి మీద నుంచి శ్యాంపిల్స్ తీసుకురావాలన్నా, మానవ ప్రయోగాలు చేపట్టాలన్నా.. ఈ ప్రక్రియ కీలకం కానున్నట్లు ఇస్రో వెల్లడించింది.
ప్రముఖ భారత లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన మూడవ వివాహాన్ని లండన్‌లో ముఖ్య అతిథుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ మ్యారెజ్‌కు ఇండియా నుంచి ప్రముఖులు హాజరు కావడం విశేషం.
ఒడిశా రాష్ట్రంలోని పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా వేల పిడుగులు పడ్డాయి
ఓ మూడంతస్తుల భవనం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మృత్యువాత చెందగా..అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి(Barabanki)లో చోటుచేసుకుంది.
అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 3) మాట్లాడుతూ.. “ఇండియా కూటమి రెండు రోజుల నుండి సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది. భారతదేశంలోని రెండు ప్రధాన పార్టీలైన డిఎంకె, కాంగ్రెస్ పార్టీల పెద్ద నాయకులు సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని అంటున్నారు. ప్రజల ఓట్లకోసం మన సంస్కృతిని అవమానించారని అన్నారు."
అంతరిక్ష నౌక ఇప్పుడు కొత్త కక్ష్యలోకి చేరుకుంది. ఉపగ్రహం బాగా పనిచేస్తుందని ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో స్పేస్‌క్రాఫ్ట్ గురించి తెలిపింది. ఈ ఉపగ్రహం భూమిని చుట్టుముట్టిందని పేర్కొంది.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్'కు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై ఆయన స్పందించారు. విజయసాయి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఈ భావన భారత్‌కు కొత్త కాదని ఆయన ఉద్ఘాటించారు.
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో ఒక్క ఏడాదిలో ప్రభుత్వ ఖజానాకు రూ.7,285 కోట్లకు పైగా చేరింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం సెప్టెంబర్ 1, 2022 నుంచి ఆగస్టు 31, 2023 మధ్య ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin) శనివారం సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. అతను చేసిన వ్యాఖ్యలకు అనేక మంది నేతలను ఉదయనిధిని విమర్శిస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉండి అలా ఎలా మాట్లాడతారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ(Sonia Gandhi) మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో శనివారం సాయంత్రం అడ్మిట్ అయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాను మటన్ కర్రీ(Mutton Curry) వండిన వంటకం వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తాజాగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఓ యువకుడు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పి ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరు చదవింది నిజమే. 21 ఏళ్ల పంజాబ్ కు చెందిన కుర్రాడు..కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) ప్రస్తుతం 15వ సీజన్‌లో అమితాబ్(amitabh bachchan) అడిగిన ఓ ప్రశ్నకు జవాబు చెప్పి ఆ మనీ గెల్చుకున్నాడు. అంతేకాదు సెప్టెంబర్ 4న 7 కోట్ల రూపాయల ప్రశ్నను కూడా ఎదుర్కొబోతున్నాడు.
అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.
చంద్రయాన్-3(Chandrayaan-3) విజయాన్ని ఆస్వాదిస్తున్న భారతీయులకు భారత అంతరిక్ష సంస్థ(ISRO) 10 రోజుల వ్యవధిలో మరో ట్రీట్ ఇచ్చింది.