»Amit Shah And Other Bjp Leaders Slams India Over Tamil Nadu Minister Udhayanidhi Stalin Remarks On Sanatana Dharma
Amit Shah: సీఎం కొడుకు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 3) మాట్లాడుతూ.. “ఇండియా కూటమి రెండు రోజుల నుండి సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది. భారతదేశంలోని రెండు ప్రధాన పార్టీలైన డిఎంకె, కాంగ్రెస్ పార్టీల పెద్ద నాయకులు సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని అంటున్నారు. ప్రజల ఓట్లకోసం మన సంస్కృతిని అవమానించారని అన్నారు."
Amit Shah:’సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి’ అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. ఈ ప్రకటన తర్వాత బిజెపి ప్రతిపక్ష కూటమి ఇండియాని (ఐఎన్డిఐఎ) చుట్టుముట్టింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా ఆదివారం (సెప్టెంబర్ 3) మాట్లాడుతూ.. “ఇండియా కూటమి రెండు రోజుల నుండి సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది. భారతదేశంలోని రెండు ప్రధాన పార్టీలైన డిఎంకె, కాంగ్రెస్ పార్టీల పెద్ద నాయకులు సనాతన ధర్మాన్ని రద్దు చేయాలని అంటున్నారు. ప్రజల ఓట్లకోసం మన సంస్కృతిని అవమానించారని అన్నారు.”
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మాన్ని అంతం చేయాలని మాట్లాడుతున్నారని.. మన సనాతన ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదని, గతంలో మన్మోహన్ సింగ్ కూడా ఈ సందర్భంగా అన్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. మోదీ గెలిస్తే సనాతన్ రాజ్ చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. లష్కరే తోయిబా కంటే హిందూ సంస్థలే ప్రమాదకరమని రాహుల్ గాంధీ అన్నట్లు రాజస్థాన్లో జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్ షా అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్ష కూటమిని టార్గెట్ చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఆయన మాట్లాడుతూ, “మూడు రోజుల క్రితం వారు (ఇండియా కూటమి సభ్యులు) ముంబైలో ఒక వ్యూహాన్ని రచించడానికి సమావేశమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేయాలన్నదే అతని రాజకీయ వ్యూహంగా జేపీ నడ్డా పేర్కొన్నారు.